Advertisementt

బాహుబలి2 ఆడియో కి గెస్ట్ ఎవరో తెలుసా?

Sat 25th Mar 2017 08:55 PM
bahubali 2,baahuabli 2 audio launch,ss rajamouli,rajinikanth  బాహుబలి2 ఆడియో కి గెస్ట్ ఎవరో తెలుసా?
బాహుబలి2 ఆడియో కి గెస్ట్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

'బాహుబలి ది కన్ క్లూజన్' సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం బాహుబలి ది కన్ క్లూజన్ ట్రైలర్ ని చూసి అదరహో అని కితాబునిస్తుంటే ఇప్పుడు మరో వేడుకకి బాహుబలి 2 రంగం సిద్ధం చేస్తుంది. బాహుబలి ది కన్ క్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 26 న భారీ లెవల్లో జరిపించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి కేవలం బాలీవుడ్ నుండి కరణ్ జోహార్ తోపాటు అక్కడి మీడియా మాత్రమే హాజరవుతుందని... టాలీవుడ్ ప్రముఖుల్ని ఈ ఈవెంట్ కి రాజమౌళి ఆహ్వానించలేదని విశ్వసనీయ సమాచారం.

ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖుల్ని పిలవకపోయినా ఏప్రిల్ 9న‌ చెన్నైలో జరిగే `బాహుబలి ది కన్ క్లూజన్` ఆడియో ఈవెంట్‌కి మాత్రం చాలామంది అతిధులు హాజరవుతారని... ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఇంకా కోలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఆడియో వేడుకకి హాజరవుతారని తెలుస్తుంది.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా తదితరులు నటించిన ఈ 'బాహుబలి ది కన్ క్లూజన్' వచ్చే నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ