ఇప్పటికింకా నా వయసు... నిండా పదహారే అంటూ హాట్ ఐటమ్ సాంగ్ లో టాలీవుడ్ ను షేక్ చేసిన ఐటం గార్ల్ ముమైత్ ఖాన్. ఈమె తాజాగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోకిరి పాట లాగానే తాను కూడా ఇప్పటికి ఇంకా నలుగురితోనే సహజీవనం చేశానంటూ వెల్లడించడంతో ముమైత్ ఖాన్ అభిమానులంతా అవాక్కయ్యారు. పోకిరితో ఐటమ్ సాంగ్ చేసి మంచి క్రేజీ మైలేజ్ ను సొంతం చేసుకున్న ముమైతా ఖాన్ ఆ తర్వాత పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తుండటంతో ఆ రకంగా టాలీవుడ్ ఐటమ్ బాంబ్ స్థానాన్ని ఎవరికి వాళ్ళు పోటీ పడి మరీ ప్రచారం కోసం పాట్లు పడుతున్నారు.
తిరిగి ఈ మధ్య సినిమాల్లో సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా ఈ భామ ఇక నుండి సినిమాల్లో నటిస్తానని చెప్తూనే తాను ఇప్పటివరకు నలుగురితో డేటింగ్ చేశానంటూ వెల్లడించింది. అయితే మొదట్లో తాను డబ్బులను విపరీతంగా ఖర్చు చేసేదాన్ని అనీ, ఏకంగా ఒక వ్యక్తి కోసం 27 లక్షలు పెట్టి సర్జరీ చేయించుకున్నానని, ఇకపై అలాంటి తప్పులు చేయదలచుకోవడం లేదని తెలిపింది. గతంలో ఒక వ్యక్తిని నమ్మి నాలుగేళ్లపాటు సహజీవనం చేసానని, ఆ తర్వాత అతని పద్ధతులు నచ్చకపోవడంతో విడిపోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత మరో వ్యక్తితో రెండేళ్ల పాటు సహజీవనం, మరో వ్యక్తితో ఒకటిన్నర సంవత్సరం కలిసి తిరిగామని చెప్పి ముమైత్ ఖాన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. కాగా ముమైత్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.