Advertisementt

సల్మాన్‌ఖాన్‌ స్పీడ్ ఇలా వుంది..!

Sun 26th Mar 2017 07:40 PM
salman khan,katrina kaif,salman khan 2017 movies,tubelight,tiger zinda hai  సల్మాన్‌ఖాన్‌ స్పీడ్ ఇలా వుంది..!
సల్మాన్‌ఖాన్‌ స్పీడ్ ఇలా వుంది..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ఇప్పుడు జోరు పెంచాడు. ఈ ఏడాది ద్వితీయార్దంలో అందునా కేవలం అతి తక్కువ గ్యాప్‌లో ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ప్రస్తుతం హ్యాట్రిక్‌ మూవీగా 'ట్యూబ్‌లైట్‌' చిత్రం చేస్తున్నాడు. ఇందులో షారుఖ్‌ అతిధి పాత్రను చేస్తున్నాడు. కాగా 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్దం నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడికల్‌ మూవీగా రూపొందుతోంది. ఇక ఇందులో చైనా నటి జుజు ముఖ్యపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం రంజాన్‌ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. 

ఇక సల్మాన్‌ ప్రస్తుతం ఆస్ట్రియాలో మరో చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రం గతంలో వచ్చిన 'ఏక్‌ థా టైగర్‌'కు సీక్వెల్‌గా రూపొందుతోంది. 'టైగర్‌ జిందా హై' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్‌ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని కూడా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో మరోసారి సల్మాన్‌ అమీర్‌ 'దంగల్‌, పీకే' రికార్డ్సుపై కన్నేశాడు. ఇక తక్కువ వ్యవధిలో తమ హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలకు రెడీ అవుతుండటంతో సల్మాన్‌ అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఇకపై కూడా సల్మాన్‌ ఏడాదికి కనీసం రెండు చిత్రాలనైనా చేయాలని వారు కోరుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ