Advertisementt

పవన్ పై అక్కసును వెళ్ళకక్కిన వర్మ.!

Sun 26th Mar 2017 08:18 PM
ram gopal varma,twitter,katamarayudu movie,pawan fans,katamarayudu flop,3 marriages,good movie  పవన్ పై అక్కసును వెళ్ళకక్కిన వర్మ.!
పవన్ పై అక్కసును వెళ్ళకక్కిన వర్మ.!
Advertisement
Ads by CJ

నిన్నటికి మొన్న పవన్ ఫ్యాన్స్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య మీడియా మాధ్యమంగా పెద్ద వార్ జరిగింది. దాంతో వర్మ పవన్ ఫ్యాన్స్ కు బై చెప్పాడు. అయితే మళ్ళీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, పవన్ మీద, ఆయన ఫ్యాన్స్ మీద ట్వీట్స్ లు వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి తాను అంటున్న మాటలను మరెవరో తన చెవులో వేసినట్లుగా వెల్లడించడం తన టక్కరి చేష్టలను చెప్పకనే చెప్పింది. అయితే వర్మ ఏం ట్వీట్ చేశాడంటే... ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం ఎంతో మేలని తనతో ఎవరో అన్నట్లు చెప్పకొచ్చాడు. ఇంకా వర్మ మాట్లాడుతూ... అభిమానులు చాలా వెర్రి భ్రమల్లో ఉండడం, బ్లైండ్ గా, డంబ్ గా ఉండటం కారణంగా నాయకులు కూడా అదేవిధంగా తయారవుతున్నారని వర్మ ట్వీట్ చేశాడు.

ఇంకా వర్మ మరో మండిపోయే ట్వీట్ చేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా చేసిస్తే మంచిది కదా అనీ తనతో ఎవరో అన్నట్టు వర్మ తెలిపాడు. ఇంకా వర్మ అంతటితో ఆగకుండా.. పవన్‌ అభిమానులను గేదెలతో పోల్చాడు. అదేంటంటే.. గేదెల చర్మం కాస్త పటిష్టంగానైనా ఉంటుందని, పవన్‌ ఫ్యాన్స్‌ కు మాత్రం అది కూడా ఉండదని వర్మ వెల్లడించాడు. ఇంకా వర్మ తన ఆక్రోశాన్ని, ఆవేశాన్ని పలు ట్వీట్ల రూపంలో వెల్లడించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ