Advertisementt

రవితేజ ప్లానింగ్ వర్కవుట్ అయితేనా..!

Sun 26th Mar 2017 11:06 PM
raviteja,massraja,bogan remake,touch chesi choodu,raja the great  రవితేజ ప్లానింగ్ వర్కవుట్ అయితేనా..!
రవితేజ ప్లానింగ్ వర్కవుట్ అయితేనా..!
Advertisement
Ads by CJ

రవితేజ ప్రస్తుతం మూడు చిత్రాలను ఒప్పుకున్నాడు. విక్రమ్‌సిరి దర్శకత్వంలో 'టచ్‌ చేసి చూడు', అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్‌' చిత్రాలతోపాటు తాజాగా తమిళ 'బోగన్‌' రీమేక్‌ను ఒప్పుకున్నాడు. కాగా రవితేజ తన కెరీర్‌ బాగా ఎదిగిన తర్వాత ఒకే ఒక్క చిత్రంతో ప్రయోగం చేశాడు. అదే 'నా ఆటోగ్రాఫ్‌'. నటునిగా ఆచిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చినా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. ఇక ఆయన తన కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు రీమేక్‌ చిత్రాలు చేశాడు. ఇందులో 'ఇడియట్‌' మాత్రమే హిట్‌. 

ఆయన చేసిన 'వీడే, దొంగోడు, శంభో శివ శంభో, నా ఆటోగ్రాఫ్‌'లు రీమేక్‌లే. కానీ ఇవ్వన్నీ ఫ్లాప్‌లే. దీంతో ఆయన మరో రీమేక్‌గా 'బోగన్‌' చిత్రాన్ని ఒప్పుకోవడం, 'రాజా ది గ్రేట్‌' చిత్రంలో అంధునిగా నటించడానికి ఒప్పుకొని, మరో ప్రయోగం చేయనుండటం చూస్తే ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రవితేజ ఇలాంటి చెత్త సెంటిమెంట్లను పక్కనపెట్టి తాను అనుకున్నదే చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్‌తో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు నిర్ణయించుకున్నాడు. మరి ఈ షాకింగ్‌ నిర్ణయాలైనా ఆయనకు కలిసొస్తే భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని మంచి విజయాలను ఆశించే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ