Advertisementt

పవన్‌ విషయంలో వర్మ చెలరేగిపోతున్నాడు!

Mon 27th Mar 2017 05:08 PM
rgv,ram gopal varma,pawan kalyan,katama rayudu,pawan kalyan fans  పవన్‌ విషయంలో వర్మ చెలరేగిపోతున్నాడు!
పవన్‌ విషయంలో వర్మ చెలరేగిపోతున్నాడు!
Advertisement
Ads by CJ

ఇప్పటికే ఎన్నోసార్లు సినీజోష్‌ వర్మ వంటి వారిని కెలకకూడదని, వర్మ తిడితే పవన్‌ అభిమానులు ఓ పువ్వు పంపాలని చెప్పింది. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ ఆ విషయం లైట్‌గా తీసుకున్నారు. ఇక మొదట్లో పవన్‌ని విపరీతంగా పొగిడి, రాజకీయాలలోకి పవన్‌ రావాలని చెప్పిన వర్మ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' నుంచి రెచ్చిపోయాడు. ఇక నాగబాబు వర్మని అక్కుపక్షి అని తిట్టడం, పవన్‌ ప్రెస్‌మీట్లో వర్మ పోర్న్‌ సినిమాలు చూస్తాడని వ్యక్తిగత విషయాలపై మాట్లాడేసరికి ఇక వర్మ రెచ్చిపోతున్నాడు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ బెంబేలెత్తుతున్నారు. 

'కాటమరాయుడు' తర్వాత వర్మ చేస్తున్న ట్వీట్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. జనసేన(పవన్‌) ఫాలోయర్స్‌ వెర్రిభ్రమల్లో ఉండటం, గుడ్దిగా, మూగగా ఉండటం వల్ల వాళ్ల నాయకులు కూడా అలాగే నడుస్తున్నారన్నాడు. ఇక 'బాహుబలి' ట్రైలర్‌ చూసిన తర్వాతనైనా పవన్‌ ఇలాంటి పవర్‌లెస్‌ సినిమాలు ఎందుకు చేస్తున్నాడన్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఒక మంచి సినిమా చేయడం మంచిదని తనతో ఎవరో అన్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇంతకు ముందు పవన్‌ ప్యాన్స్‌ ఏమి అన్నా పట్టించుకోని వర్మ ఎప్పుడైతే పవన్‌ తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించాడో.. తర్వాత నుంచి పవన్‌ మూడు పెళ్లిళ్లను చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. 

పవన్‌ అభిమానులు దున్నపోతులని, దున్నపోతులకు కనీసం చర్మం గట్టిగా అయిన ఉంటుందని, కానీ పవన్‌ ఫ్యాన్స్‌కి అది కూడా లేదంటూ సెటైర్‌ వేశాడు. పవన్‌ చిత్రం చూడటం కంటే ఓ పోర్న్‌సినిమా చూడటం మంచిదని తనతో ఓ 70ఏళ్ల వ్యక్తి అన్నాడని దెప్పిపొడిచాడు. ఇక 30కోట్లు పెట్టి ఓ సినిమా తీసి 70కోట్లను జేబులో వేసుకొని కూతురి బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్లిన అతన్ని చూస్తే రోమ్‌ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్లుంటుందని సెటైర్‌ వేశాడు. పెద్దలు చెప్పినట్లు అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ