Advertisementt

సమంత చిన్ననాటి పబ్ విషయం..!

Tue 28th Mar 2017 07:46 PM
samantha,samantha pub matter,samantha old incidents  సమంత చిన్ననాటి పబ్ విషయం..!
సమంత చిన్ననాటి పబ్ విషయం..!
Advertisement
Ads by CJ

సమంతకి పబ్బు గురించి అస్సలు తెలియదంట. అదేమిటి అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి పబ్ గురించి తెలియకపోవడమేమిటి అని ఆశ్చర్య పోతున్నారా? అది ఇప్పుడు విషయం కాదులెండి. సమంత చదువుకునే రోజుల్లో పబ్ గురించి వాళ్ళు, వీళ్ళు మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదంట. పబ్ లో పార్టీ చేసుకుంటే చాలా మజా వస్తుందని సమంత ఫ్రెండ్ లావణ్య వాళ్ళ అక్క చెబితే విని తనకి కూడా పబ్ కి వెళ్లాలనే కోరిక పుట్టేసిందట. అయితే పబ్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారట సమంత అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్.

సమంత ఫ్రెండ్స్ లో లావణ్య అనే అమ్మాయి తల్లితండ్రులు వేరే వూరికి వెళ్లాల్సి రావడంతో లావణ్య కి వాళ్ళ అక్కకి కాపలాగా వాళ్ళ బామ్మని ఉంచి లావణ్య పేరెంట్స్ ఊరికివెళ్ళారు. మాకు అదే మంచి టైమ్ పబ్ కి వెళ్ళడానికి అనుకుని బామ్మ నిద్ర పోయాక అందరం పబ్ కి వెల్దామనుకుని కొంతమంది ఇళ్ల దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ వచ్చేసాం. కానీ బామ్మ ఎంతసేపటికి పడుకోకపోయేసరికి లావణ్య వాళ్ళ అక్క బామ్మకి ఒక నిద్ర మాత్ర పాలల్లో కలిపి ఇచ్చేసరికి బామ్మ నిద్ర పోవడంతో మేము అందరం పబ్ కి చెక్కేసాం అని చెప్పుకొస్తుంది సమంత.

అయితే పబ్ లో ఎంజాయ్ చేసాం గాని ఆ రాత్రి బామ్మకి ఏదన్న జరిగితే ఆ బాధ మమ్మల్ని లైఫ్ లాంగ్ వెంటాడేదని... దేవుడు ఎలాగో కరుణించి బామ్మకి ఏం కాకుండా చూసాడు కాబట్టి అందరం బతికి పోయామని..... ఇప్పటికి నా లైఫ్ లో అదో పెద్ద సాహసమే అని చెబుతుంది సమంత. అప్పుడు పబ్ కి వెళ్లాలంటే ఇంత హంగామా చెయ్యాలి.. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఎంచక్కా పబ్బుల్లో ఫ్రెండ్స్ తో ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చెయ్యొచ్చు కదా... సామ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ