పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' చిత్రం విడుదలై మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైన త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెల నుండి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఎలాగు పవన్ ప్రస్తుతానికి ఫ్రీగానే వున్నాడు కాబట్టి ఇక ఈ సినిమాని పట్టాలెక్కించడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు.
ఈ చిత్రంలో అప్పుడే పవన్ కి జోడిగా హీరోయిన్ కీర్తి సురేష్ ని, అను ఇమ్మాన్యుయేల్ ని ఎంపిక చేసిన త్రివిక్రమ్, మరో ముఖ్య పాత్ర కోసం తమిళ నటి ఖుష్బూ ని తీసుకున్నాడు. ఇక ఇప్పుడు పవన్ పక్కన నటించే కమెడియన్ రోల్ కోసం మరో తమిళ నటుడుని సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. ‘మారి, సింగం 3’ వంటి చిత్రాలతో తమిళంలో ఫెమస్ అయిన రోబో శంకర్ ని పవన్ చిత్రం కోసం త్రివిక్రమ్ సెట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి విడుదల చేస్తానని చెబుతున్నాడు. అందుకే సినిమా సెట్స్ మీదకి వెళ్లే లోపే ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చెయ్యాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.