Advertisementt

బాలయ్య- పూరి లకి టైటిల్ ఫిక్సయిందా..!

Wed 29th Mar 2017 09:17 PM
balakrishna,puri jagannadh,ustad,tapori  బాలయ్య- పూరి లకి టైటిల్ ఫిక్సయిందా..!
బాలయ్య- పూరి లకి టైటిల్ ఫిక్సయిందా..!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎలాగైనా ఈ చిత్రాన్ని త్వరత్వరగా తెరకెక్కించి సెప్టెంబర్ 29 కి విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నాడని పూరి క్లారిటీ ఇచ్చాడు. అలాగే ముంబై మోడల్ బాలయ్య పక్కన జోడిగా వన్ అఫ్ ద హీరోయిన్ గా ముస్కాన్ ని ఫైనల్ చేసినట్లుగా కూడా పూరి చెప్పేసాడు. అలాగే ఐటెం సాంగ్ కి కూడా బాలీవుడ్ నుండి సన్నీ లియోన్ ని దించుతున్నాడు పూరి. ఇకపోతే పూరి 'టపోరి' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించగా అది బాలకృష్ణ కొత్త చిత్రం టైటిల్ అంటూ కొంత ప్రచారం జరిగింది.

కానీ ఆ టైటిల్ బాలకృష్ణ కి అసలు బాగోదనే కామెంట్స్ పడ్డాయి. అయితే ఇపుడు బాలకృష్ణ కు 'ఉస్తాద్' అనే టైటిల్ ను పూరిజగన్నాధ్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ని, మరొక హీరోయిన్ ని, పూరి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే భారీ లెవల్లో ఎనౌన్స్ చెయ్యాలని భావిస్తున్నాడట. మరి ఆ సెకండ్ షెడ్యూల్ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే మొదలవ్వబోతుందట. అంటే మరో వారం రోజుల్లో బాలయ్య కొత్త చిత్ర టైటిల్ అండ్ హీరోయిన్ పేర్లు ఒకేసారి తెలుస్తాయన్నమాట.

ఇక 'ఉస్తాద్' అనే టైటిల్ పూరి చెప్పిన గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని... బాలకృష్ణ కూడా 'ఉస్తాద్' టైటిల్ కే ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ