Advertisementt

హీరో నాని కి మరో బుల్లి నాని..!

Wed 29th Mar 2017 10:02 PM
nani,hero nani nani with anjana,father,nani son  హీరో నాని కి మరో బుల్లి నాని..!
హీరో నాని కి మరో బుల్లి నాని..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సహజ నటుడు, యువ క‌థానాయ‌కుడు అయిన నానికి ఈ హేవళంబి నామ ఉగాది చాలా ప్రత్యేకమైనది. ఈ ఉగాది నాని జీవితానికి ఓ మర‌పురాని మధురానుభూతిని ఇచ్చిందనే చెప్పాలి. నాని నాన్న అయ్యాడన్న వార్త తెలిసిన అభిమానులు కూడా ఉగాది సంబరాన్ని రెట్టించిన ఉత్సాహంతో ఖుషీ ఖుషీగా జరుపుకుంటున్నారు. 

నాని – అంజనలకు ఐదు ఏళ్ళ క్రితం వివాహం అయిన విషయం తెలిసిందే. కాగా అంజన బుధవారం ఉదయం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానూ, ఆరోగ్యంగానూ ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ యేడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ వార్త మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఓ పక్క నేను లోకల్ మంచి హిట్ అయ్యింది. మరో పక్క నంది అవార్డు వచ్చింది. అంతే కాకుండా మరో విషయం ఏంటంటే తాజాగా జరిగే ఐఫా ఉత్సవాల్లో నాని తొలిసారిగా యాంకరింగ్ చేయబోతున్నాడు. ఉగాది రోజున నాన్న కావడంతో నాని అంతులేని ఉత్సాహానికి లోనౌతున్నాడు. కంగ్రాట్స్ టూ నాని. నాని శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుండటంతో మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనుంది చిత్రయూనిట్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ