'నేను శైలజ'తో తెలుగులో కి కాలుమోపి లక్కీ హీరోయిన్ గా పేరు కొట్టేసింది కీర్తి సురేష్. మరోపక్క తమిళంలో కూడా జెండా పాతి అక్కడా లక్కీగా పేరు కొట్టేసింది. ఒక్క తెలుగు సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కీర్తి.. నానితో 'నేను లోకల్' లో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమెకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చేసింది. కారణం ఏకకాలంలో పవన్ కళ్యాణ్ పక్కన, మహేష్ పక్కన ఛాన్స్ కొట్టెయ్యడమే కాక సావిత్రి బయో పిక్ లో సావిత్రి రోల్ చేసే ఛాన్స్ కొట్టెయ్యడం కూడా ఆ డిమాండ్ కి కారణం.
అంతే కాకుండా తమిళంలో కూడా సూపర్ సక్సెస్ అందిస్తున్న ఈ హీరోయిన్ కి అక్కడ 2 కోట్ల డిమాండ్ ఉందట. ఇక్కడ తెలుగులో అయితే 'నేను లోకల్' చిత్రం వరకు కేవలం 1 .5 కోట్లు వరకు పారితోషకం తీసుకునే కీర్తి ఒక్కసారే తన డిమాండ్ పెంన్చేసిందని టాక్. మరి తెలుగులో బడా హీరోలతో చేసేటప్పుడు ఆ మాత్రం డిమాండ్ చేస్తుంది కదా మరి. అయితే కీర్తి డిమాండ్ చేసిందో లేదో తెలియదు గాని మహానటి సావిత్రి పాత్ర చెయ్యడానికి కీర్తి ఏకంగా 3 కోట్ల పారితోషకం అందుకుందని టాక్ వినబడుతుంది.
అయితే సావిత్రి చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రెండిటీలో విడుదల చేస్తారు కాబట్టి కీర్తికి తెలుగులో, తమిళంలో మంచి డిమాండ్ ఉండబట్టే ఆమెకి అంత పారితోషకాన్ని మహానటి నిర్మాత అశ్వినీదత్ అందించాడని అంటున్నారు. ఎంతైనా మూడుకోట్లు అంటే కీర్తి రేంజ్ చిన్న నిర్మాతలకు అందేలా కనబడం లేదు మరి.