మెగా హీరోలందరూ ప్రస్తుతానికి టాప్ పొజిషన్ లోనే ఉన్నారు ఒక్క వరుణ్ తేజ్ తప్ప. వరుణ్ తేజ్ ముకుందా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలబడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ లో నటిస్తున్న వరుణ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా లో నటిస్తున్నాడు. ఇప్పుడు మిస్టర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి మెగా హీరోలందరూ హాజరై వరుణ్ 'మిస్టర్' కి పబ్లిసిటీ చెయ్యాలని ఆలోచిస్తున్నారట. ఇక ఈ ఫంక్షన్ కి మెగా స్టార్ చిరుతో పాటు మెగా హీరోలంతా హాజరవుతారని భావిస్తున్నారట. అందులోను వరుణ్ ఎటువంటి డిమాండ్ లేని డైరెక్టర్ తో నటించడం కూడా మైనస్ అవుతుందనే కారణంగా ఇటువంటి పబ్లిసిటీకి మెగా హీరోలు తెర తీసారని చెబుతున్నారు. శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ సినిమాల వైఫల్యాలతో ఉండడం వలన మిస్టర్ చిత్రానికి పెద్దగా క్రేజ్ రాని కారణంగా వరుణ్ ని ఆదుకోవడానికి మెగా హీరోలు రంగంలోకి దిగినట్లు వార్తలొస్తున్నాయి.
మరి మెగాస్టార్ చిరుతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరైతే వరుణ్ తేజ్ కి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అని అంటున్నారు. మరి పవన్ పిలిచినా మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హాజరవడు. కానీ నాగబాబు అన్న పరిస్థితి చూసైనా పవన్ మనసు మార్చుకుంటే బావుంటుందని కామెంట్స్ పడుతున్నాయి. చూద్దాం పవన్ ఏం చేస్తాడో...?