తెలుగు టెలివిజన్ రంగంలో 'జబర్దస్త్'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ షోకి అత్యధిక టీఆర్పీలు రావడమే కాదు... ఎందరో మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తెస్తున్న కార్యక్రమం ఇది. కాగా గత కొద్దిరోజులుగా ఓ స్కిట్ విషయంలో వస్తున్న ప్రోమోలు అందరినీ విపరీతంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ టీం జడ్జిలైన నాగబాబు, రోజాలతో గొడవ పడినట్లు, ఈ ప్రోగ్రాం నుంచి నాగబాబు సుధీర్‌ని గెంటివేసినట్లు ఈ ప్రోమోలల్లో ఉండటంతో అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఏప్రిల్‌ఫూల్స్‌కి ముందు రోజు రాత్రి ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఇదంతా టీఆర్పీల కోసం చేసిన ప్రయత్నమేనని తేలిపోయింది.
దీంతో ప్రేక్షకులు ఈ కార్యక్రమంపై తీవ్ర నిరసనను, ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్పీల కోసం మరీ ఇంత దిగజారాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో నాగబాబు, రోజాలను, కార్యక్రమ నిర్వాహకులను తప్పు పడుతున్నారు. ఇలా ప్రేక్షకులను ఫూల్స్‌ని చేస్తే దానివల్ల అసలు ఈ షోనే వీక్షకుల్లో పలచనవుతుందని అంటున్నారు. కాగా ఈ ఎపిసోడ్‌కు యూట్యూబ్‌లో కూడా భారీగా డిస్‌లైక్స్ వస్తున్నాయి. లైక్స్ కంటే డిస్‌లైక్స్ సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని బట్టి ఈ ఎపిసోడ్‌పై వీక్షకులకు ఏర్పడిన అభిప్రాయం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది.