Advertisementt

అప్పుడే మొదటి షాట్ చిత్రీకరించారు..!

Tue 04th Apr 2017 05:03 PM
pawan kalyan,next movie,director trivikram,heroines anu emmanuelle,keerthi suresh  అప్పుడే మొదటి షాట్ చిత్రీకరించారు..!
అప్పుడే మొదటి షాట్ చిత్రీకరించారు..!
Advertisement
Ads by CJ

పవన్ నటించిన 'కాటమరాయుడు' ఫలితమెలా వున్నా పవన్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించే చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అప్పుడే పవన్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్నారు. వీరితోపాటు సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ చిత్ర  రెగ్యులర్ షూటింగ్ నిన్న సోమవారమే మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన కాఫీ షాప్ సెట్ లో మొదటి రోజు షూటింగ్ ని స్టార్ట్ చేశారు. మొదటి రోజు షూట్ లోనే పవన్ -  అను ఇమ్మాన్యుయేల్ ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు.

ఇక మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వారంలోనే పవన్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో జాయిన్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ దాదాపు ఒక నెల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనబడనున్నాడు. 

ఇక త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మొదలైన మూడో ప్రాజెక్ట్ మీద లెక్కకు మించి అంచనాలున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ