Advertisementt

టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేస్తుందిగా..!

Tue 04th Apr 2017 09:42 PM
heroine rashmika,kannada movie kirik party,allu arjun,prabhas,director vakkantham vamsi  టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేస్తుందిగా..!
టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేస్తుందిగా..!
Advertisement
Ads by CJ

ఒకే ఒక్క కన్నడ చిత్రంతో మంచి పేరు కొట్టేసిన రష్మిక మందన్న పేరు ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. 'కిరిక్ పార్టీ' చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించిన రష్మిక మీద టాలీవుడ్ టాప్ హీరోలు కన్నేశారు. ఇప్పటికే యంగ్ హీరో నాగ సౌర్య  నిర్మాతగా మరి హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మిక నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభాస్ - సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రానికి కూడా ప్రభాస్ కి జోడిగా రష్మిక పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం  రష్మిక నే హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ 'డీజే' చిత్రం కంప్లీట్ కాగానే వక్కంతం వంశీ డైరెక్షన్ లో చెయ్యబోయే 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రానికి హీరోయిన్ గా రష్మికను తీసుకుంటే బావుంటుందని భావించడమే తడువుగా ఆమెను హైదరాబాద్ రప్పించడము.... ఫోటో షూట్ చేయించడము జరిగిపోయాయని అంటున్నారు. ఇక ఈమె స్క్రీన్ టెస్ట్ చూసిన డైరెక్టర్ గారు, హీరోగారు ఫుల్ శాటిస్ ఫై అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రష్మిక లుక్స్ అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో నా పేరు సూర్య... చిత్రానికి హీరోయిన్ గా దాదాపు రష్మికనే ఖాయం చేసినట్లు చెబుతున్నారు. మరి ఇంకా సినిమా మొదలుకాక ముందే ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసేసి సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని వక్కంతం - అల్లు అర్జున్ లు చూస్తున్నారట. ఏదిఏమైనా ఒకే ఒక్క హిట్ సినిమాతో  ఇప్పుడు రష్మిక మాత్రం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.