Advertisementt

దుమ్ము రేపడానికి 4 వ సారి వస్తున్నారు..!

Thu 06th Apr 2017 06:05 PM
salman khan,dhoom 4,dhoom 4 on cards,aditya chopra  దుమ్ము రేపడానికి 4 వ సారి వస్తున్నారు..!
దుమ్ము రేపడానికి 4 వ సారి వస్తున్నారు..!
Advertisement
Ads by CJ

ఈమధ్య మన హీరోలు మంచి దొంగలుగా మారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం నేర్చుకుంటున్నారు. కాగా హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ తరహాలో బాలీవుడ్‌లో కొంతకాలంగా 'ధూమ్‌' పేరుతో దొంగలు దాడి చేస్తున్నారు. మొదటి మూడు భాగాలు ఘనవిజయం సాధించడంతో మరోసారి ఈ చిత్ర నిర్మాత ఆదిత్యాచోప్రా మరోసారి నాలుగోభాగంతో ముందుకు రావడానికి సన్నాహాలు మొదలుపెట్టేశాడు. జాన్‌అబ్రహం, హృతిక్‌రోషన్‌, అమీర్‌ఖాన్‌లతో అభిషేక్‌ బచ్చన్‌ని కలిపి ఆయన తీసిన ధూమ్‌ సిరీస్‌లు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. దీంతో తన నాలుగోభాగంలో దొంగగా నటించే అవకాశం ఆయన షారుఖ్‌ఖాన్‌కి ఇస్తాడనే ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆ అవకాశం సల్మాన్‌ఖాన్‌కి దక్కింది. ఇందులో కూడా అభిషేక్‌ బచ్చన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను చేయనున్నాడు. ఇక సల్మాన్‌కి జోడీగా మరోసారి కత్రినాకైఫ్‌ కనిపించనుంది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. మరి ఈ 'ధూమ్‌4' బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి దుమ్మురేపుతుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ