ప్రస్తుతం తెలుగులో ఉన్న యువస్టార్స్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ది విభిన్నశైలి. సరైన పాత్ర, దమ్మున్న కంటెంట్ దొరికితే ఆయన తన విశ్వరూపం చూపిస్తాడు. వాచకం, ఆహార్యం.. అన్నింటిలోనూ ఇరగదీస్తాడు. 'యమదొంగ'లో యంగ్ యమునిగా, 'అదుర్స్'లో చారి పాత్రలతో ఆయన చూపించిన వేరియేషన్స్ దీనికి మంచి ఉదాహరణ. ఇక ప్రస్తుతం ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జై లవ కుశ'. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న ఈ టైటిల్‌నే తాజాగా కన్‌ఫర్మ్ చేయడంతో ఈ చిత్రం విషయంలో వినిపిస్తున్న పలు వార్తలకు కూడా బలం చేకూరింది.
ఇందులో 'జై' అనే నెగటివ్ పాత్రలో, 'లవకుమార్' అనే మరో పవర్‌ఫుల్ పాత్రలో, కుశకుమార్ అనే ఓ కామెడీ పాత్రలో ఆయన అలరించనున్నాడు. ప్రస్తుతం లవకుమార్‌కి సంబందించిన షూటింగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇక జై అనే నెగటివ్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ పాత్ర మేకప్, బాడీలాంగ్వేజ్ నుంచి అన్ని విషయాలలోనూ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేయించారట. కాగా వాచకంలో కూడా ఈ నెగటివ్ పాత్రలో ఎన్టీఆర్‌కి నత్తి ఉంటుందని తెలుస్తోంది. ఒకపక్క చరణ్ చెవిటివాడుగా, రవితేజ, రాజ్‌తరుణ్‌లు గుడ్డివారిగా నటిస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ నత్తివాడిగా నటించడం ఆసక్తిని కలిగిస్తోంది.