Advertisementt

'ట్యూబ్‌లైట్‌' పై ఆసక్తి ఎక్కువవుతోంది..!

Thu 06th Apr 2017 08:02 PM
tubelight,salman khan,ramjan,salman tubelight details  'ట్యూబ్‌లైట్‌' పై ఆసక్తి ఎక్కువవుతోంది..!
'ట్యూబ్‌లైట్‌' పై ఆసక్తి ఎక్కువవుతోంది..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎవరినోట విన్నా కూడా సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'ట్యూబ్‌లైట్‌' చుట్టూనే ఆసక్తికర చర్చ సాగుతోంది. కేవలం ఈ చిత్రంలో మూడే పాటలున్నాయి. కానీ ఈ చిత్రం ఆడియో హక్కులు ఏకంగా 30కోట్లకు అమ్ముడై సంచలనం సృష్టించాయి. ఇప్పటికే రెండు బిగ్గెస్ట్‌ హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న హ్యాట్రిక్‌ మూవీ ఈ చిత్రం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం రంజాన్‌ కానుకగా మూడు రోజుల ముందే పండుగను తేనుంది. ప్రతి రంజాన్‌కి ప్రేక్షకులకు ఓ సినిమాను గిఫ్ట్‌గా సల్మాన్‌ ఇస్తూ ఉన్నాడు. ఈ ఏడాది ఆయన 'ట్యూబ్‌లైట్‌'ని ప్రేక్షకులకు రంజాన్‌ కానుకగా అందించనున్నాడు. ఈ చిత్రం ఇండో-చైనా యుద్ద నేపధ్యంలో ఓ హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడవనుంది. ఓ చైనా నటి ప్రధాన పాత్రను పోషిస్తోంది. యుద్ద నేపద్యంలో ప్రేమలో పడిన ఓ ఇండియా యువకుడు, చైనా యువతి తమ ప్రేమ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు అనే ఆసక్తికర పాయింట్‌ చుట్టూ ఈ కథ నడవనుంది. ఇందులో ఓ అతిధిపాత్రలో షారుఖ్‌ఖాన్‌ నటిస్తుండటం విశేషం. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు చేస్తుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ