64వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ఈ రోజు శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా… ' రుస్తుం' సినిమాలో నటనకు అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. సురభి ఉత్తమ నటిగా ఎంపిక అయ్యింది. జాతీయ ఉత్తమచిత్రంగా 'నీరజ' నిలిచింది. రాజు సుందరం(జనతా గ్యారేజ్)కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు వరించింది.
మరికొన్ని జాతీయ అవార్డుల వివరాలు:
ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్ (రుస్తుం)
ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి
ఉత్తమ బాలల చిత్రం – ధనక్
ఉత్తమ ఫైట్ మాస్టర్ – పీటర్ హెయిన్స్ (పులిమురుగన్
ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – శివాయ్