జాతీయ ఉత్తమ అవార్డులను ప్రకటించారు. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' దిల్‌రాజు 'శతమానం భవతి'తో పాటు కొత్తదర్శకుడు తరుణ్‌భాస్కర్ తీసిన 'పెళ్లిచూపులు' చిత్రాలు హవా చాటాయి. చిరు 'ఖైదీ'కి నిరాశే మిగిలింది. ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ సంభాషణలకు గాను పెళ్లిచూపులుకు అవార్డులు దక్కాయి. ఇక 'జనతా గ్యారేజ్'కి ఉత్తమ కొరియోగ్రాఫీకి గాను రాజు సుందరంకు అవార్డు దక్కింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'శతమానం భవతి' నిలిచింది. మొత్తానికి ఈసారి అవార్డుల ఎంపిక పారదర్శకంగానే జరిగినట్లు అర్ధమవుతోంది. ఐఫా వంటి ప్రైవేట్ సంస్థలు అవార్డుల విషయంలో 'పెళ్లిచూపులు'ని చిన్న చూపు చూసినా కూడా తరుణ్‌భాస్కర్ ఆవేదనకు తగ్గ ఫలితం వచ్చింది. మొత్తానికి 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు విమర్శలకు తావివ్వకుండా జరగడం, దానికి సహకరించిన సమాచారప్రసారశాఖా మంత్రి వెంకయ్యనాయుడుకి అందరూ రుణపడి ఉంటారనే చెప్పాలి.