Advertisementt

వర్మ మరలా గోకాడు..!

Fri 07th Apr 2017 08:35 PM
director ram gopal varma,sri devi,sri devi child photo post in twitter,ram gopal varma twites on sri devi  వర్మ మరలా గోకాడు..!
వర్మ మరలా గోకాడు..!
Advertisement
Ads by CJ

శ్రీదేవి మీద పిచ్చితోనే పరిశ్రమకు వచ్చానని, ఆమె అందం చూసి తట్టుకోలేక దర్శకుడిని అయ్యానని వర్మ ఓపెన్‌గా చెప్పేవాడు. శ్రీదేవి అంటే ఆయన పడిచస్తాడు. పనిలో పనిగా తన కెరీర్‌ప్రారంభంలోనే శ్రీదేవిని 'క్షణక్షణం, గోవిందా.. గోవిందా' చిత్రాలలో తీసుకున్నాడు. ఇక ఎప్పుడైన సరే శ్రీదేవి నామజపం మానని ఈ వివాదాస్పద దర్శకుడు తాజాగా శ్రీదేవి చిన్ననాటి ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. ఈమె ఎవరో గుర్తు పట్టగలరా? అంటూనే ఈ చిన్నారి బాలిక భారతీయ సినీ చరిత్రను ఏలి, సూపర్‌స్టార్‌గా నిలుస్తుందని ఎవరైనా ఊహించారా? అంటూ ట్వీట్‌చేశాడు. కాగా ఈయన గతంలో 'శ్రీదేవి' పేరుతో ఓ చిత్రం తీశాడు.

అది ఏమైందో అందరికీ తెలిసిందే. కాగా శ్రీదేవి దక్షిణాదిని, ఉత్తరాదిని ఓ ఊపు ఊపిన తర్వాత మరలా 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం 'పులి'లో ఓ కీరోల్‌ చేసింది. మరలా చాలా కాలానికి ఆమె 'మామ్‌'చిత్రంతో జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే పనిలో పనిగా తన చేతికి కూడా పనిచెప్పిన వర్మ ప్రస్తుతం మరలా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ