చినబాబు సారీ.. లోకేష్‌బాబు మంత్రి సీటులో కూర్చోగానే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడు. పనిలో పనిగా మీడియా గొంతు కూడా నొక్కేద్దామని డిసైడ్ అయ్యాడు. ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలను ఇప్పటికే పలు ప్రకటనలు, బెదిరింపులతో తమ గుప్పిట్లోకీ తెచ్చుకున్నాడు. ఎన్టీవీని సైతం కొమ్మినేని తీసివేయించి, తమదారికి తెచ్చుకున్నారు. ఇక జగన్ సాక్షిని బెదిరించడం వారి వల్ల కావడం లేదు. గతంలో వైఎస్ బతికున్నప్పుడు ఆ రెండు పత్రిలు అని బహిరంగంగా విమర్శించేవాడు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లు కూడా సాక్షి పేపర్, సాక్షి చానెల్స్‌పై పడ్డారు.
ఇక ఈ సాక్షి తప్పితే మిగిలినవన్నీ వంగి వంగి సలాం చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాను మాత్రం వారు తమ గుప్పిట్లోకి తెచ్చుకోలేకపోతున్నారు. సోషల్‌మీడియాలో ఎక్కువ మంది టిడిపిని, చంద్రబాబును, లోకేష్‌లను ఉతికి ఆరేస్తున్నారు. దీంతో ఐటి శాఖామంత్రిగా పదవిని చేపట్టిన వెంటనే ఆయన తన పార్టీ నాయకులతో సోషల్‌మీడియాలో పార్టీ మీద, పార్టీ నాయకుల మీద విమర్శలు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపాడు. మరి ఆయన ఏ విధంగా సోషల్‌మీడియాను అదుపు చేస్తాడో వేచిచూడాల్సివుంది....!