Advertisementt

మహేష్‌ చిత్రానికి భారి బిజినెస్‌..!

Sat 08th Apr 2017 11:55 PM
mahesh babu,director murgaadas,koratala siva,mahesh babu family trip,prelease business 150 crores  మహేష్‌ చిత్రానికి భారి బిజినెస్‌..!
మహేష్‌ చిత్రానికి భారి బిజినెస్‌..!
Advertisement
Ads by CJ

మహేష్‌ ప్రస్తుతం మురుగదాస్‌ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని హిందీలోకి కూడా అనువదించనున్నారు. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే భారీ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ థియేటికల్‌ రైట్స్‌, శాటిలైట్‌రైట్స్‌, ఆడియో, ఓవర్‌సీస్‌ రైట్స్‌ అన్నీ కలుపుకుని దాదాపు 150కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఖాయమంటున్నారు. ఇక ఈ చిత్రానికి మురుగదాస్‌ పుణ్యమా అని తమిళ్‌లో, హిందీలో కూడా బిజినెస్‌ ఎంక్వైరీలు బాగా జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రం షూటింగ్‌కి షార్ట్‌గ్యాప్‌ ఇచ్చి ఫ్యామిలీతో సహా సింగపూర్‌కి వెళ్లిన ఆయన తిరిగి వచ్చి చెన్నైలో జరుగుతున్న చివరి షెడ్యూల్‌లో బిజీ అయ్యాడు. ఇక హీరోగా ఎంత బిజీగా ఉన్నా మహేష్‌ తన ఫ్యామిలీ కోసమని ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాడు. దీంతో ఆయన మంచి నటుడే కాదు.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా పేరుతెచ్చుకున్నాడు. ఏడాదిలో కనీసం నాలుగైదుసార్లు ఫ్యామిలీతో విదేశీ ట్రిప్‌లకు వెళ్లుంటాడు. కాగా మురుగదాస్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఆయన కొరటాల చిత్రంలో బిజీ అవుతాడు.

శ్రీమంతుడు చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా కూడా కథ విషయంలో ఓ వ్యక్తి నుంచి వీరికి చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. దీంతో స్వతహాగా కొరటాల రచయితే అయినా ఈ చిత్రం కథను ఓ ఫ్లాప్‌ దర్శక రచయిత నుండి కోటి రూపాయలు చెల్లించి మరోసారి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటున్నాడు. మరి 'సింహా'చిత్రం కార్డ్స్‌లో తనకు పేరు వేయలేదని బాధపడిన కొరటాల ఈ చిత్రం టైటిల్స్‌లో ఆ రచయిత పేరు వేస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ