Advertisementt

ఈ డైరెక్టర్ లను చూసి భయపడుతున్నారు..!

Sun 09th Apr 2017 10:13 AM
directors puri jagannadh,maniratnam,cheliyaa movie,rogue,chiranjeevi,balakrishna,venkatesh  ఈ డైరెక్టర్ లను చూసి భయపడుతున్నారు..!
ఈ డైరెక్టర్ లను చూసి భయపడుతున్నారు..!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ వరస ఫ్లాప్‌లలో ఉన్నప్పటికీ బాలకృష్ణ అతనికి ఓ చిత్రం అవకాశం ఇచ్చాడు. కానీ ఆవెంటనే రిలీజైన పూరీ తీసిన 'రోగ్‌' ఫలితం చూసిన తర్వాత బాలయ్యతో పాటు నిర్మాతలు ఆనందప్రసాద్‌, బాలయ్య అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక వెంకీ కూడా తాను పూరీతో ఓ చిత్రం చేయలని భావించాడు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం విషయంలో పునరాలోచనలో ఉన్నాడని సమాచారం. ఇక పూరీ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి చర్చించాడు. అసలే ఎవ్వరినీ ఒకపట్టాన నమ్మని పూరికి చిరు అవకాశం ఇచ్చే చాన్స్‌ లేదంటున్నారు.

ఇక తాజాగా నిన్న విడుదలైన క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం దర్శకత్వంలో కార్తి,హైదిరీరావులు నటించిన 'చెలియా' చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో త్వరలో మణిరత్నంతో ఓ చిత్రం చేయాలని భావించిన రామ్‌చరణ్‌, ఆయన తండ్రి చిరంజీవిలు ఇప్పుడు మణి విషయంలో కూడా పునరాలోచనలో పడ్డారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ