Advertisementt

మురుగదాస్ ఫైర్ కి కారణం ఏమిటీ..?

Sun 09th Apr 2017 10:49 AM
director a.r. murugadoss,64th national film awards,jury members,a.r. murugadoss fire on jury members  మురుగదాస్ ఫైర్ కి కారణం ఏమిటీ..?
మురుగదాస్ ఫైర్ కి కారణం ఏమిటీ..?
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం కేంద్రం 64వ జాతీయ సినిమా అవార్డులును ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా…   'రుస్తుం' సినిమాలో నటనకు అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రంగా  జోకర్‌ ఎంపిక కాగా ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా, ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌ చిత్రాలను జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ మీద తమిళ దర్శకుడు మురుగదాస్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. ఈ అవార్డుల ఎంపికను కొంతమంది విమర్శించినా మరికొంతమంది సమర్ధించారు. కానీ ఈ దర్శకుడు మాత్రం జ్యురి సభ్యులపై తీవ్రమైన ఆరోపణలను, ఆగ్రహాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. జ్యూరీ సభ్యులపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్టు ఈ అవార్డుల ఎంపిక బట్టి స్పష్టంగా అర్థమవుతోందని.... అవార్డుల ఎంపికలో పక్షపాత వైఖరి తేటతెల్లమవుతోందని ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.

మరి మురుగదాస్ ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణమేమిటోగాని ఇప్పుడు మాత్రం ఆయన చేసిన ట్వీట్స్ వేడెక్కిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ