Advertisementt

ఈ ఇద్దరు స్టార్స్ ఈ సారైనా కలుస్తారా..?

Sun 09th Apr 2017 10:50 AM
akkineni nagarjuna,nandamuri balakrishna,tsr,tsr tv9 awards in vizag  ఈ ఇద్దరు స్టార్స్ ఈ సారైనా కలుస్తారా..?
ఈ ఇద్దరు స్టార్స్ ఈ సారైనా కలుస్తారా..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ హీరోస్ నాగార్జునకు బాలకృష్ణ కు మధ్యన తత్సంబందాలు సరిగ్గా లేవని అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయము విదితమే. ఎందుకో ఏమో తెలియదు గాని నాగార్జునకి బాలకృష్ణ కి అస్సలు పడదు. మళ్లీ వీరిద్దరూ మిగిలిన వారితో తత్సంబందాలను బాగానే మెయింటెన్ చేస్తారు. ఇక మిగిలిన సీనియర్ హీరోస్ అయిన చిరు, వెంకీ లతో వీరు బాగానే క్లోజ్ గా మూవ్ అవుతారు. అయితే వీరిద్దరి మధ్యన తలెత్తిన విభేదాలను సమసిపోయేలా చెయ్యడానికి నాగార్జునే స్వయంగా ప్రయత్నించినట్లు చెబుతారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదని అంటారు.

అయితే ఇపుడు వీరిద్దరూ ఒకే వేదిక పై కలవబోతున్నారని చెబుతున్నారు. అదే ఈ రోజు వైజాగ్ లో జరిగే టిఎస్సార్  -  టీవీ 9 అవార్డుల వేడుకలో వీరిద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి ఏటా సుబ్బరామిరెడ్డి - టివి 9  సంయుక్తంగా నిర్వహించే టిఎస్సార్  -  టీవీ 9 అవార్డుల వేడుకలో నాగార్జునకి బెస్ట్ యాక్టర్ కేటగిరి విభాగంలో, బాలకృష్ణ కి బెస్ట్ హీరో కేటగిరీలో పేర్లను ప్రకటించారు. మరి అందరికి ఎంతో కావాల్సిన సుబ్బరామిరెడ్డి పిలిచి అవార్డునిస్తుంటే వీరు వెళ్ళాక మానేస్తారా? అందుకే వీరిద్దరూ ఖచ్చితంగా ఒకే వేదికపైన కలుస్తారని అంటున్నారు. 

మరి నాగార్జున ఎప్పటినుండో బాలకృష్ణతో  కలిసిపోవాలని చూస్తున్నాడు. కానీ బాలకృష్ణేమో నాగ్ ని దూరం పెట్టేస్తున్నాడు. ఈసారి ఈ అవార్డుల పుణ్యమా అని వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే అటు నందమూరి అభిమానులకి ఇటు అక్కినేని అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోతుంది. చూద్దాం ఈ విషయం మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ