సీనియర్ హీరోస్ నాగార్జున కి బాలకృష్ణ కి ఏవో విభేదాలు ఉండడం వలన వీరిద్దరూ మాట్లాడుకోరని ఒకరు పిలిచినా మరొకరు రారని ఏవేవో రూమర్స్ ప్రచారంలో వున్నాయి. ఈ రూమర్స్ కి బలం చేకూర్చేలా టాలీవుడ్ మొత్తం అక్కినేని నాగేశ్వర రావు చనిపోయినప్పుడు ఆయన చివరి దర్శనార్ధం బాలకృష్ణ హాజరవలేదని అంటుంటారు. ఒకటేమిటి చాలానే గాసిప్స్ వీరిమీద కథలు కథలుగా ప్రచారమయ్యాయి. ఇక ఈ శనివారమైతే సోషల్ మీడియాలో ఏకంగా టిఎస్సార్ - టీవీ 9 అవార్డుల వేడుకలో నాగ్ - బాలయ్య స్టేజి మీదకెక్కాక వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారా లేదా కౌగిలించుకుని తమ మధ్య ఏమీ విభేదాలు లేవని స్పష్టం చేస్తారా అని తెగ ప్రచారం జరిగింది.
అయితే ఈ రూమర్స్ కి, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి అటు నాగార్జున ఇటు బాలకృష్ణ చెక్ పెట్టేసారు. ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది ఎక్కడో కాదు.... వైజాగ్ లో జరుగుతున్న టిఎస్సార్ - టీవీ 9 అవార్డుల వేడుకలోనే. టి సుబ్బరామిరెడ్డి - టివి 9 సంయుక్తంగా నిర్వహిస్తున్న టిఎస్సార్ - టీవీ 9 అవార్డుల వేడుకకి నాగార్జున, బాలకృష్ణ లు హాజరయ్యారు. అక్కడ స్టేజి మీద నాగార్జున మాట్లాడుతూ..తనకు బాలకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చాయని, అయితే అవన్నీ వట్టి రూమర్స్ అని స్పష్టం చేశాడు. అలాగే వేదిక మీద బాలయ్యను ఆప్యాయంగా కౌగిలించుకుని నాగార్జున అందరికి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
నాగ్ మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ కూడా నాగార్జున మాటలకు చిరునవ్వు నవ్వాడు. ఇదంతా చూసి స్టేజ్ మీదున్న ప్రముఖులతో పాటు ఇరు వర్గాల ఫ్యాన్స్ కేరింతలతో చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.