Advertisementt

రజనీ నిర్ణయం వెనుక కారణం ఏమిటి..?

Sun 09th Apr 2017 01:42 PM
super star rajinikanth,tamil nadu,rk beach,rajini fans  రజనీ నిర్ణయం వెనుక కారణం ఏమిటి..?
రజనీ నిర్ణయం వెనుక కారణం ఏమిటి..?
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌ తన ఫ్యాన్స్‌లో ఈనెల 12 నుంచి 16వరకు సమావేశాలు నిర్వహిస్తానని చెప్పాడు. కానీ సడన్‌గా ఆ నిర్ణయం మార్చుకున్నాడు. అందరితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగితే సమయం చాలదని భావించినట్లు ఆయన తెలిపాడు. అందుకే త్వరలో జిల్లాల వారిగా అభిమానులతో సమావేశమై అందరినీ సంతృప్తిపరుస్తానని వ్యాఖ్యానించాడు. కానీ ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. అసలే ఆర్కేనగర్‌ ఎన్నికల వేడిలో ఉన్న తమిళనాడులో తాను ఇప్పుడు ఫ్యాన్స్‌తో సమావేశాలు నిర్వహిస్తే అది పొలిటికల్‌ అరంగేట్రం కోసం చేస్తున్న ప్రయత్నాలుగా ప్రచారం సాగే అవకాశం ఉంది. దాంతో ఆయన ఈ హఠాత్తు నిర్ణయం తీసుకున్నాడు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే రజనీకి ప్రజాస్వామ్యం మీద ఎనలేని గౌరవం ఉంది. 12వ తేదీన జరగనున్న ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఆయన ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించాడు. ఇక తాను 12 నుంచి అభిమానుల సమావేశాలు నిర్వహిస్తే అది 12వ తేదీన జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆ తేదీని ఉపసంహరించుకున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ