గత కొద్దిరోజులుగా హీరో, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమ కొడుకంటూ కొందరు వాదిస్తున్నారు. వారు ధనుష్ చిన్ననాటి ఫోటోలతో పాటు ధనుష్‌కు చిన్నప్పుడు ఉన్న పుట్టుమచ్చలను కూడా చెబుతున్నారు. మరోపక్క ధనుష్ ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నోరు విప్పలేదు. తన పుట్టుమచ్చలను ఆయన లేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదే సమయంలో కృష్ణమూర్తి అనే యువకుడు స్వర్గీయ జయలలితకు తానే కొడుకునంటున్నాడు.
జయకు సర్గీయ తెలుగు హీరో శోభన్‌బాబులకు పుట్టిన వాడిని నేనేనంటూ కోర్టుకెళ్లాడు. కొన్ని డాక్యుమెంట్లను కూడా సమర్పించి సాక్షిసంతకం స్వయాన ఎంజీఆర్ పెట్టాడని వాదిస్తున్నాడు. కానీ ఆయన కోర్టుకిచ్చిన డాక్యుమెంట్లు పోర్జరీవని హైకోర్టు తేల్చింది. ఈరోడ్‌కి చెందిన ఇతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అబ్బా.. పెద్దపెద్ద వాళ్లకు సెలబ్రిటీలకు ఈ గోల ఎప్పటికి తప్పుతుందో కదా....!