రెండు సీట్లున్న బిజెపిని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ఘనత అభినవ ఉక్కుమనిషి ఎల్.కె. అద్వానీకే దక్కుతుంది. వాజ్‌పేయ్ మంచి నాయకుడైనప్పటికీ ఆయన ఉదారవాది. కానీ అద్వానీ ఫైర్ బ్రాండ్. అతి వాది. దాంతో తాను బిజెపికి అద్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన బిజెపిని నిలబెట్టారు. వాజ్‌పేయ్ బదులు తనను ప్రధానిగా ఉండాలని కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. వాజ్‌పేయ్‌కి ప్రధాని పదవిని ఇచ్చి తన ఉదారత చాటుకున్నాడు.
కాగా కిందటి ఎన్నికల్లో అద్వానీని పక్కనపెట్టి బిజెపి మోదీని తెరపైకి తెచ్చింది. దీనికి అనేక కారణాలున్నాయి. కాగా గోద్రా సంఘటన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని పదవి నుంచి తీసేయాలని వాజ్‌పేయ్ భావించారు. కానీ అద్వానీ అడ్డుపడ్డారు. మోదీనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని సర్దిచెప్పారు. ఫలితమే నేడు మోదీ ప్రధాని పదవి. ఇక అద్వానీ నేడు పార్లమెంట్ నడుస్తున్న విధానం, మోదీ తీసుకుంటున్న నియంతృత్వ పోకడల పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
ఏపీ విభజన సమయంలో ఇంత చెత్తగా రాష్ట్రాలను విభజించడం తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. కాని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన శిరసావహించారు. ఇప్పుడు తనకు రాష్ట్రపతిని కావడం కూడా ఇష్టంలేదని స్పష్టం చేశాడు. తాను ప్రజల మద్యే ఉంటానన్నాడు. ఇక బాబ్రీ మసీదు అంశం మరలా కోర్టు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది కానీ ఒక్కవిషయం నిజం... బిజెపి నేటి నాయకులు అద్వానీకి ఇవాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వడం లేదు...!