శ్రీనువైట్ల తన చిత్రాలలో పలువురు సినీ ప్రముఖులను ఇమిటేట్ చేయించి, సెటైర్లు వేస్తుంటాడు. 'దుబాయ్ శ్రీను'తో పాటు పలు చిత్రాలలో ఇది గమనించవచ్చు. సర్గీయ సంగీత దర్శకుడు చక్రిని, రాంగోపాల్‌వర్మని, కోనవెంకట్ వంటి వారిపై పలు చిత్రాలలో సెటైర్లు వేశాడు. కాగా ఆయన తాజాగా తీస్తోన్న 'మిస్టర్'చిత్రంలో ఆయన విక్టరీ వెంకటేష్‌ను టార్గెట్‌చేస్తున్నాడని సమాచారం. పృథ్వీ క్యారెక్టర్‌కు 'లక్ష్మీతులసి'అనే పేరునుపెట్టి ఆయన ఈ సారి వెంకీపై వ్యంగ్యాస్త్రాలు సంధించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రేక్షకులు శ్రీనువైట్లకు ఎలాంటి తీర్పునిస్తారో కూడా వేచిచూడాల్సివుంది.