యోగా బ్యూటీ, స్వీటీ అనుష్క 'సైజ్ జీరో' చిత్రం కోసం ఏకంగా 20 కేజీలు బరువు పెరిగింది. ఎలాంటి కృత్రిమ పద్దతులను ఆచరించకుండా ఆమె ఈ సాహసం చేసింది. దీంతో ఆమెకు మంచి పేరు వచ్చినా తీరని కష్టాలు మొదలయ్యాయి. ఆమె ఇటీవల నటించిన 'సింగం 3, ఓం నమో వేంకటేశాయ' చిత్రాలలో కూడా బొద్దుగా కనిపించి ఆయా సినిమాలకు మైనస్ అయింది. ఇక 'బాహుబలి 2 'లో నిర్మాతలు ఆమె మూలంగా 20కోట్లు నష్టం తెచ్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
ఆమె బరువు పెరిగి బొద్దుగా మారడంతో 'బాహుబలి -ది కన్‌క్లూజన్' చిత్రం కోసం రాజమౌళి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ నిపుణుల సహాయంతో ఆమెను నాజూకుగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. మరోపక్క ఆమె 'భాగమతి'అనే చిత్రంలో లీడ్‌రోల్ చేస్తోంది. యువి క్రియేషన్స్ బేనర్‌లో 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇక ఇటీవల ఆమె సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో నాజూకు అనుష్క కనపిచండం చూసి చాలా మంది ఆనందపడ్డారు. కానీ 'బాహుబలి -ది- కన్‌క్లూజన్' ప్రమోషన్‌లో భాగంగా ఆమె వెళ్తున్న చోట్ల మాత్రం మరీ అంత నాజూకుగా ఏమీ కనిపించడం లేదు. దీంతో సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.