Advertisementt

స్టార్‌ ఇమేజ్‌ వైపు అడుగులు...!

Wed 12th Apr 2017 12:03 PM
mehrene kaur pirzada,5 movies,top stars,tollywood,krishnagadi veera premagada movie,single movie  స్టార్‌ ఇమేజ్‌ వైపు అడుగులు...!
స్టార్‌ ఇమేజ్‌ వైపు అడుగులు...!
Advertisement
Ads by CJ

ఆమె నటించింది ఒకే ఒక్క చిత్రం. ఆ సినిమా రిలీజై కూడా ఏడాది దాటింది. కానీ ఇప్పటివరకు ఆమె పెద్దగా ప్రేక్షకుల దృష్టిలో పడకపోయినా కానీ పలువురు సినీ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఐదు చిత్రాలలో నటిస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె ఎవరో కాదు పంజాబీ భామ మెహరీన్. ఆమె 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

ప్రస్తుతం ఆమె సుశీంద్రన్‌ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. ఇక రవితేజ - అనిల్‌రావిపూడిల కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న 'రాజా ది గ్రేట్‌'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే సాయిధరమ్‌తేజ్‌ 'జవాన్‌', త్వరలో ప్రారంభం కానున్న వరుణ్‌తేజ్‌ - వెంకీ చిత్రాలలో కూడా ఈమె అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వీటితో పాటు పలు చిత్రాలలో ఆమె నటించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తానికి ఈభామ స్టార్‌ హీరోల దృష్టిని కూడా త్వరగానే ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ