Advertisementt

ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా నివేత థామస్..!

Wed 12th Apr 2017 05:46 PM
heroine niveda thomas,rakul preet singh,raashi khanna,samantha,jai lava kusa movie,director bobby  ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా నివేత థామస్..!
ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా నివేత థామస్..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే టైటిల్ 'జై లవ కుశ' అని పెట్టారని అంటున్నారు. మొదటిసారి త్రిపాత్రాభినయం చెయ్యబోతున్న ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాని ఎంపిక చెయ్యగా మరో హీరోయిన్ గా నివేత థామస్ పేరు ప్రచారంలో వుంది.

అయితే ఇప్పుడు మరో హీరోయిన్ గా నివేద థామస్‌ ఎంపిక చేసినట్లు డైరెక్టర్ బాబీ ట్విట్టర్ లో ఆఫీసియల్ గా ఎనౌన్స్ చేసాడు. ఇక మిగిలిన మూడో హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయాల్సి వుంది. అయితే ఆ మూడో హీరోయిన్ గా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు ప్రచారంలో వున్నాయి. మరి ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాల్సి వుంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ