బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నటించిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ని పూరి డైరెక్షన్ లో మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళిపోయాడు. యమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - పూరి ల చిత్రం గురించి ఒక వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే బాలయ్య గౌతమీపుత్ర... తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి పూరి - బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే వున్నాయి. అయితే ఈ చిత్రంపై బయ్యర్ల కన్ను పడి ఈ సినిమా బడ్జెట్ బిజినెస్ వ్యవహారాలు తెలుసుకోవాలని బయ్యర్లు ప్రయత్నించగా.. వారికి హీరోయిన్ ఛార్మి చుక్కలు చూపిస్తోందట.
అయితే పూరి తన పనులన్నీ తన బిజినెస్ పార్ట్నర్ అయిన హీరోయిన్ ఛార్మీకి అప్పజెప్పిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ సినిమాలను డైరెక్ట్ చేస్తూనే పూరీ కనెక్ట్స్ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి విదితమే. ఇక ఈ పూరి కనెక్ట్స్ వ్యవాహారాలు మొత్తం ఛార్మీకి అప్పజెప్పేసి తాను మాత్రం డైరెక్షన్ మీద పూర్తి దృష్టి కేటాయించాడట. ఇక పూరి కనెక్ట్స్ బిజినెస్ వ్యవహారాలను చక్కబెడుతున్న ఛార్మీ ఇప్పుడు బాలయ్య 101వ మూవీ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యిందట. ఇలా ఎంటర్ అయిన ఛార్మీ.. బాలయ్య చిత్రానికి ఏరియా వైజ్ గా ఒక్కో రేటు చెబుతూ బయ్యర్లకు చుక్కలు చూపిస్తోందట.
ఇక ఈ రేటు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం రేటుకంటే ఎక్కువగా ఉండడంతో బయ్యర్లకు కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయట. మరి ఛార్మీ ఇలా ఓవరేక్షన్ చేస్తే గనక సినిమా బిజినెస్ పై బాగా దెబ్బపడే ఛాన్స్ ఎక్కువ అవుతుందని ఫిలింనగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.