Advertisementt

ఈ పాటతో వంశీ మార్కు కనిపిస్తోంది..!

Sun 16th Apr 2017 12:01 PM
director vamsi,fashion designer son of ladies tailor movie,hero sumanth aswin  ఈ పాటతో వంశీ మార్కు కనిపిస్తోంది..!
ఈ పాటతో వంశీ మార్కు కనిపిస్తోంది..!
Advertisement
Ads by CJ

దర్శకునిగా పెద్ద వంశీ టాలెంట్‌ ఏమిటో అందరికీ తెలుసు. ఆయన తీసే చిత్రాలు ఎప్పుడు విభిన్న పంధాలో రొటీన్‌కు కాస్త భిన్నంగా ఉంటాయి. 'సితార, అన్వేషణ, లేడీస్‌టైలర్‌, ఏప్రిల్‌1 విడుదల... ' ఇలా ఆయన ప్రతి చిత్రం ఓ ఆణిముత్యం. కానీ ఈమధ్య ఆయన రేసులో వెనకపడిపోయారు. ఆరోగ్యం బాగా లేక మెంటల్‌గా ఇబ్బందులు కూడా పడుతున్నాడనే వార్తలు వచ్చాయి. 

ఇన్నేళ్ల తన కెరీర్‌లో కేవలం 25కి అటు ఇటుగా మాత్రమే చిత్రాలను తీసిన ఆయన వరుస విజయాలను అందించలేకపోవడం, నిలకడ లేమి అనేవి ఆయనకు ఇబ్బందులుగా మారాయి. కానీ ఈసారి మాత్రం దర్శకునిగా తనకి, హీరోగా రాజేంద్రప్రసాద్‌కి బ్రేక్‌నిచ్చిన 'లేడీస్‌టైలర్‌'కి సీక్వెల్‌గా 'ఫ్యాషన్‌డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌టైలర్‌'ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులో రాజ్‌కిరణ్‌ వంటి హీరో నటించి ఉంటే ఇప్పటికే మంచి ఊపు వచ్చి ఉండేది. కానీ ఇందులో సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్నాడు. 

ఇక తాజాగా విడుదల చేసిన ఈ చిత్రంలోని పాట వంశీ మార్కును చూపిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌ ఏదైనా సరే వంశీ ఎప్పుడు పాపికొండలు,గోదావరి అందాలను మాత్రం మర్చిపోడని ఈ పాటను చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రం సిటీ బ్యాక్‌డ్రాప్‌లోనా ? లేక ఫ్యాషన్‌ డిజైనర్స్‌ పల్లెలకు కూడా వ్యాపించడంతో మరోసారి విలేజీ బ్యాక్‌డ్రాప్‌నే ఎంచుకున్నాడా? అనే ఆసక్తిని ఈ పాట రేకెత్తిస్తోంది. ఇక తన ఆస్థాన సంగీత దర్శకులైన ఇళయరాజా సైడ్‌ అయిన తర్వాత వంశీ స్వర్గీయ చక్రిని ఎంచుకున్నాడు. మరి ఈ చిత్రంలోని 'మణి' పూసలాంటి మ్యూజికల్‌ హిట్‌ను ఎదురుచూడచ్చనే అనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ