బాహుబలి-ది కన్‌క్లూజన్ చిత్రం విడుదలకు సిద్దం కావడంతో యూనిట్‌తో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రమా రాజమౌళి కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీటిలో ఆమె తన కుటుంబ ప్రస్తావన కూడా తెస్తున్నారు. ఇక రమా రాజమౌళి తాజాగా మాట్లాడుతూ.. రాజమౌళి ఎప్పుడు లూజ్ దుస్తులు ధరించేవారని, కానీ ఆయన్ను బాడీకి ఫిట్‌గా ఉండే దుస్తులు ధరించపజేయడంలో మాత్రం తాను విజయవంతమైనానని తెలిపింది.
ఇక ఈ చిత్రంలో అనుష్క మేకప్ కోసం బాగా కష్టపడాల్సివచ్చిందని, ఆమెది సున్నితమైన చర్మం కావడంతో మేకప్‌లో ఏమాత్రం తేడా వచ్చినా రాషెస్ వచ్చేవని, అందుకే ఆమె మేకప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. ఇక రాజమౌళి తీసిన చిత్రాలన్నీ తనకు నచ్చినా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో తీసిన 'యమదొంగ' చిత్రం మాత్రం తనకు నచ్చలేదంది. కానీ ఇప్పటికీ దానికి కారణం మాత్రం తనకు తెలియదని, కానీ ఆ చిత్రం బాగా ఆడినా కూడా తన రాజమౌళి వల్ల కాకుండా ఎన్టీఆర్ వల్లే హిట్టయిందని తాను భావిస్తున్నానని తెలపడం విశేషం. మొత్తానికి ఈ వ్యాఖ్యలు మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.