తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ సారధ్యంలో ఇచ్చిన జాతీయ అవార్డులు నిజాయితీగా ఇచ్చారనే ఒప్పుకోవాలి. కానీ దర్శకుడు మురుగదాస్ మాత్రం తన చిత్రానికి అవార్డు రాకపోయే సరికి కామెంట్స్‌తో రెచ్చిపోతున్నాడు. ఇక అవార్డుల విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. ఎంత బాగా ఇచ్చినా కూడా అందరినీ తృప్తి పరచడం కష్టం. కానీ ఈ అవార్డుల విషయంలో మురుగదాస్ ఆవేదన అర్ధరహితమనే చెప్పాలి.
అక్షయ్‌కుమార్‌కి అవార్డు రావడం సమంజసమే. కానీ కేవలం స్వార్థంతోనే ఆయనకు అవార్డు ఇచ్చారనడం తప్పు. ఇస్తే నంది.. ఇవ్వకపోతే.. పంది అనేది అవార్దుల విషయంలో అందరూ ఒప్పుకునేదే. ఇక 'కత్తి'కి రీమేక్ 'ఖైదీ నెంబర్ 150' అయినప్పటికీ ఈ చిత్రానికి ఏదో విధంగా అవార్డు వచ్చేలా చిరు ప్రయత్నాలు చేస్తున్నాడని, కేంద్రంలో తన పరపతిని వాడుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి అవార్డులు రాలేదు.
మరి దీనిని ఏమంటారు? ఇప్పటికే ఎందరో కమల్‌హాసన్ నుంచి బాలకృష్ణ, మహేష్‌ల వరకు అవార్డులపై తమకు నమ్మకాలు లేవని చెప్పిన వారే. అటువంటప్పుడు అవార్డులు ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి కదా...! అని మురుగదాస్ సర్దిచెప్పుకుని, మహేష్‌తో చేస్తున్న చిత్రం ద్వారా తన టాలెంట్‌తో అవార్డుల కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి కదా...!