Advertisementt

అబ్బ..మంచు లక్ష్మికి అంత కోపమెందుకో?

Mon 17th Apr 2017 07:18 PM
manchu lakshmi,fashion designer son of ladies tailor,vamsee director,madhura sridhar  అబ్బ..మంచు లక్ష్మికి అంత కోపమెందుకో?
Manchu Lakshmi fires on Fashion Designer Poster అబ్బ..మంచు లక్ష్మికి అంత కోపమెందుకో?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సీనియర్‌ దర్శకుడు వంశీ తాను ఎప్పుడో తీసిన 'లేడీస్‌ టైలర్‌'కి సీక్వెల్‌గా 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌'గా చిత్రాన్ని తీస్తున్నాడు. మధురశ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలనాటి లేడీస్‌ టైలర్‌ అయిన రాజేంద్రప్రసాద్‌ కొడుకైన సుమంత్‌ అశ్విన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా సాగి ఏమి చేయనున్నాడు? ఎలాంటి కొంటెపనులు చేసి, తన తండ్రి పేరును సార్ధకం చేయనున్నాడు అనేది హాస్యభరితంగా చూపించనున్నారు. ఈ చిత్రం అవకాశం రాజ్‌తరుణ్‌ నుంచి సుమంత్‌ అశ్విన్‌కి రావడం అదృష్టమేనని చెప్పాలి. ఇప్పటి వరకు సరైన బ్రేక్‌లేని సుమంత్‌ అశ్విన్‌ రాజేంద్ర ప్రసాద్ స్థాయిలో నటించగలడా? అనేది అప్పుడు మిలియన్‌డాలర్ల ప్రశ్న. 

ఇక రాజేంద్రప్రసాద్‌కి కూడా 'లేడీస్‌ టైలర్‌' ముందు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేసినా కూడా ఈ చిత్రమే ఆయనకు కామెడీ హీరోగా బ్రేక్‌నిచ్చింది. మరి ప్రస్తుతం ఎలాంటి ఇమేజ్‌లేని సుమంత్‌ అశ్విన్‌కి ఈ చిత్రం ఎలాంటి పేరును, క్రేజ్‌ను తెస్తుందో చూడాలి. మరో వంక ఇటీవల విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లో హీరో ఫ్యాషన్‌ డిజైనర్‌ కాబట్టి ఓ హీరోయిన్‌ ఎద కొలతలు తీసుకునే పోస్టర్‌ని విడుదల చేశారు. దీనిపై మంచు లక్ష్మి వంటి 'అభ్యుదయ' భావాలున్న వారు విమర్శలు చేశారు. 

కాగా తాజాగా ఆ పోస్టర్‌లో ఉన్నది అనీషా అంబ్రోస్ అని తేలింది. ఇక వంశీ శృంగారాన్ని వెకిలిగా తీయడు. ఆయన మంచి భావాలున్న దర్శకుడు. మంచు మోహన్‌బాబుతో కూడా ఆయన 'డిటెక్టీవ్ నారద' తీశాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. బహుశా చిన్న అమ్మాయి, పెద్దగా అనుభవం లేని మంచు లక్ష్మి వంటి వారికి ఆ పోస్టర్‌ ఇబ్బందికరంగా కనిపించడంతో, వంశీ చరిత్ర నేటి వారికి తెలియకపోవడం, శృంగారానికి, బూతు, అశ్లీలతలకు తేడా తెలియక పోవడం వల్ల కొందరు అలాంటి విమర్శలు చేస్తుండవచ్చు. కానీ నేడు వస్తున్న చిత్రాల్లో శృతి మించుతున్న శృంగారం తో పోలిస్తే..ఇది అసలు లెక్కలోకి కూడా రాదు. మంచు లక్ష్మి వాటిపై ద్రుష్టి పెడితే బెటర్. 

Manchu Lakshmi fires on Fashion Designer Poster:

Lakshmi Manchu raises objection over Fashion Designer son of Ladies Tailor Poster.  The poster of Fashion Designer s/o Ladies Tailor, which released a few days back was criticised by actress Lakshmi Manchu.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ