Advertisementt

శ్రుతి హాసన్ హగ్ అందుకున్నారా..!!

Mon 17th Apr 2017 08:34 PM
shruti haasan,shruti haasan hug,shruti haasan twitter,5 million followers,katamarayudu  శ్రుతి హాసన్ హగ్ అందుకున్నారా..!!
Shruti Haasan gives Hug to Her Twitter Followers శ్రుతి హాసన్ హగ్ అందుకున్నారా..!!
Advertisement
Ads by CJ

కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ పై బాగా బ్యాడ్ కామెంట్స్ పడ్డాయి. ఆమె ఈ చిత్రంలో అసలు అందంగా కనబడడం అటుంచి శృతి బాగా లావైందని ... ఆమెకు వేసిన కాస్ట్యూమ్స్ అస్సలు బాగోలేవనే కామెంట్స్ పడ్డాయి. అసలు కాటమరాయుడు చిత్రం సగం ప్లాపవ్వడానికి శృతి హాసన్ కారణమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. పాపం ఇంతకుముందు పొగిడిన నోటితోనే శృతి హాసన్ ని తిడుతున్నారు. మరోవైపు శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ సినిమాలు, డైటింగ్ విషయాన్నీ నెగ్లెట్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. 

ఇక ఇప్పుడు శృతి హాసన్ ఆ కామెంట్స్ కి బదులు చెబుతూ బాగా కష్టపడి వర్కౌట్స్ చేస్తుందట. ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ తెగ కష్టపడిపోతుందట. అయితే ఈ కష్టాలన్నీ శృతి హాసన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమే అని అంటున్నారు. సుందర్ సి డైరెక్షన్ లో శృతి హాసన్ నటిస్తోందట. చారిత్రక నేపధ్యం గల ఈ చిత్రంలో కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు ఉంటాయి గనక... శృతి వీటిలో శిక్షణ పొందుతుంది. అయితే శృతి హాసన్ కి కాటమరాయుడు మిగిల్చిన చేదు వలన ఆమె ఏం నష్టపోలేదంట. ఇంకా ఆమెకి పాపులారిటీ బాగా వచ్చేసిందట. అదెలా అంటే శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు బాగా చేరువలో ఉంటుంది. 

ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ప్రముఖుల జాబితాలో శ్రుతి హాసన్ చేరిపోయింది. ఈ క్రమంలోనే శృతి హాసన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. ఈ దెబ్బకి శృతి సోషల్ మీడియాలో  సౌత్ హీరో హీరోయిన్స్ ని దాటేసి ఔరా అనిపించింది. మరి కాటమరాయుడు లో శృతి హాసన్ కి బ్యాడ్ కామెంట్స్ పడినప్పటికీ ఆమెకున్న ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. అయితే శృతి హాసన్ తనను ఫాలో అవుతున్న అభిమానులకు థాంక్స్ చెప్పి.... వారికి ఒక గౌగిలింత తప్ప ఇంకేం ఇవ్వగలను అంటూ హాట్ హాట్ ట్వీట్ చేసింది. ఇక శృతి ఫాలోవర్స్ మాత్రం మేం శృతి హాసన్ నుండి హగ్ అందుకున్నామనే హ్యాపీనెస్ లో ఉన్నారట.

Shruti Haasan gives Hug to Her Twitter Followers:

Shruti Haasan reaches Five million followers on Twitter. She has thanked her fans for extending love and support. "Thankyou beautiful people for my five million ! Your love and support means so much to me !!!! wish I could give a giant group hug !!,” she tweeted.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ