Advertisementt

అవును.. ఆ ఎమ్మెల్యే పవన్‌ అభిమాని!

Tue 18th Apr 2017 12:08 PM
nellore city mla anil kumar yadav,janasena,pawan kalyan,katamarayudu,johnny  అవును.. ఆ ఎమ్మెల్యే పవన్‌ అభిమాని!
Yes..! Anilkumar Yadav is Pawan Kalyan Fan అవును.. ఆ ఎమ్మెల్యే పవన్‌ అభిమాని!
Advertisement
Ads by CJ

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ గురించి ఇతర జిల్లా వాళ్లకి పెద్దగా తెలియదు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి అతితక్కువ ఓట్లలో ఓడిపోయి, వైసీపీ తరపున ఎమ్మెల్యేగా అతి తక్కువ మెజార్టీతో గెలిచాడు. ఇక ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అవును... నేను పవన్‌కళ్యాణ్‌ వీరాభిమానిని. ఆయన నటించిన చిత్రాలన్నింటిని మొదటి రోజే చూస్తాను. సినిమా హిట్‌ ఫ్లాప్‌లతో నాకు సంబంధం లేదు. 'కాటమరాయుడు'ని కూడా మొదటి షో చూశాను. ఇక 'జానీ' చిత్రం ఫ్లాప్‌ అయినా 9సార్లు చూశానని చెప్పాడు. అనిల్‌ పవన్‌కి వీరాభిమాని అని నెల్లూరులోని అందరికీ తెలుసు. 

కానీ వార్తలో ఉండాలి కాబట్టి ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా నెల్లూరులో మెగాభిమానులు ఎక్కువ. వారి సామాజిక వర్గానికి కూడా బలం బాగానే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేలలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి కూడా ఒకరు. దీంతో నెల్లూరు సిటీ పరిధిలో పవన్‌ హవా బాగానే ఉంది. దాంతో అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రస్తుతం వైసీపీలో ఉన్నా కూడా వచ్చే ఎన్నికల నాటికి జనసేనలో చేరుతాడని, ఇప్పటి నుంచే టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. 

ఇక నెల్లూరులో పవన్‌ ఫ్యాన్స్‌కి ఉన్న బలం చూసి మాజీ మంత్రి, కిందటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి, ఎమ్మెల్సీ సీటును ఆశించి, మంత్రి పదవిని చేపట్టాలని భావించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కుబేరుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా జనసేన వైపు చూస్తున్నాడని సమాచారం. 

Yes..! Anilkumar Yadav is Pawan Kalyan Fan:

Nellore City MLA Anil Kumar Yadav Is Pawan Kalyan Fan.  Nellore City MLA Anil Kumar Yadav eye on Janasena.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ