టీవీ యాంకర్ రష్మి అంటే అందరూ గుర్తుపడతారు. ఇక ఇటు సినిమాలలో కూడా చాన్స్‌లు పొందుతూ, ఆమె హాట్‌హాట్‌గా కనిపిస్తూ, బుల్లితెర ద్వారా పెద్ద ఇమేజ్ తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. దీనిలో ఆమె చాలా భాగం సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. 'గుంటూరు టాకీస్' ఆమె వల్లనే కమర్షియల్‌గా సక్సెస్ అయింది. అందులో ఆమె నటించిన ఓ హాట్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇక బుల్లితెరపై కూడా ఈ అమ్మడు హాట్‌హాట్‌గానే కనిపిస్తుంది.
ఇక పలు ఎఫైర్లలో వార్తలో నిలుస్తోంది కాగా ఈ విషయంలో ఆమె నిత్యం వార్తల్లో ఉండేందుకు మీడియాను బాగా వాడేస్తోంది. ఇక సకుంబసేమతంగా చూసే బుల్లితెరపై ఆమె హాట్‌హాట్‌గా.. అందునా కుటుంబ యావత్తు చేసే ప్రైమ్ టైమ్‌లో, పాపులర్ షోలలో ఆమె వస్త్రధారణపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ భామ మండిపడింది. హీరోయిన్లు బికినీలు వేస్తే తప్పు కాదు.. అందాలు ఆరబోస్తే తప్పుకాదు.. యాంకర్లు స్కర్ట్‌లు, మిడ్డీలు, మినీలు, షార్ట్స్ వేసుకుంటే తప్పేముందిన మండిపడింది.
వెండితెరపై బట్టలు ఊడదీసి, అందాలు ఆరబోస్తే లొట్టలు వేసుకుని ఎగబడి చూస్తారు. మరి బుల్లితెరపై చేస్తే తప్పా? అని వాదించింది. ఇక తాను ఎక్స్‌పోజ్ చేస్తే చూడటానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారని, చూసే వారుంటే తాను చూపిస్తే తప్పేముందని, తన సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించడం తన గొప్పతనమేనని, సోషల్‌మీడియాలో ఎన్నో బూతు,అశ్లీల వీడియోలు ఉండగా, తననే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. మొత్తానికి తాను టాలీవుడ్ సన్నిలియోన్ అని ఒప్పుకోవాల్సిందే.