మెగా హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గోదావరి జిల్లాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ రత్నవేలు. సుమారు 20 రోజులు నుండి ఏకథాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్ అనంతరం అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో షూట్ చేసిన ఓ సాంగ్ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తుంది.
అయితే ఈ షెడ్యూల్ జరుగుతున్న ప్రాంతం సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేని ఏరియా అంట. ఈ షూటింగ్‌లో పాల్గొన్న అందరి దగ్గర 20 రోజుల పాటు సెల్‌ఫోన్స్ మూగబోయాయి. అస్సలు ఈ షూట్‌లో వాళ్ళ దగ్గర సెల్‌ఫోన్ ఉందనే విషయమే అందరూ మరిచిపోయారంట. 20 రోజుల తర్వాత కెమెరామెన్ రత్నవేలుకి సెల్‌ఫోన్ గుర్తుకువచ్చిందట.
దీనిపై రత్నవేలు తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్విట్ కూడా చేశాడు. ఎంతో విలువైన మనిషి జీవితాన్ని సెల్‌ఫోన్ హరించేస్తుందని, ఈ 20 రోజులు ఎంతో హాయిగా గడిచాయని..రత్నవేలు తెలిపాడు!