'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం విడుదల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక 'బాహుబలి2' విడుదలకు కేవలం తొమ్మిది రోజులే వుంది. అయితే తెలుగులో, తమిళంలో, హిందీలో 'బాహుబలి2' సక్రమంగా విడుదలవుతుండగా.... కన్నడలో మాత్రం 'బాహుబలి2' విడుదల ఆపేశారనే సంకేతాలు వస్తున్నాయి. బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కావేరి జలాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని అందరి ముందు బహిరంగ క్షమాపణ చెబితేనే సత్యరాజ్ నటించిన 'బాహుబలి2' చిత్రాన్ని విడుదల సక్రమంగా జరగనిస్తామని... లేకపోతె విడుదలకానివ్వమని వారు పట్టుబట్టుకుని కూర్చున్నారు.
ఒకవేళ బాహుబలి చిత్రాన్ని ఏప్రిల్ 28 న విడుదల చెయ్యడానికి చూస్తే అక్కడ భారీ బంద్ నిర్వహించే యోచనలో కన్నడీగులు ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగు, తమిళం, హిందీలో బాహుబలి ప్రెస్ మీట్స్ నిర్వహించినట్టే అక్కడ కన్నడంలో కూడా రేపు గురువారం జరగబోయే బాహుబలి ప్రెస్ మీట్ ని కూడా అడ్డుకునేందుకు కన్నడీగులు కాచుకుని కూర్చున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే కావేరి సమస్యపై చేసిన వ్యాఖ్యల గురించి స్పందించిన డైరెక్టర్ రాజమౌళి సత్య రాజ్ ఆ వ్యాఖ్యలు చేసి చాలా కాలమైంది... ఆ వ్యాఖ్యల తర్వాత సత్యరాజ్ గారి చాలా సినిమాలు కన్నడలో విడుదలయ్యాయి... అలాగే బాహుబలి 1 కూడా అప్పుడే విడుదలయ్యింది... అపుడు లేని సమస్య ఇప్పుడు బాహుబలి 2 కి సృష్టించడం భావ్యం కాదని అంటున్నాడు.
మరి రాజమౌళి చెప్పింది కూడా నిజమే. కన్నడీగులకు అప్పుడులేని బాధ ఇపుడెందుకు. కావాలని చెయ్యడం కాకపోతే ఇలా ఒక నటుడు గురించి మిగతా వాళ్ళని బాధపెట్టడం కరెక్ట్ కాదు కదా...!