మన స్టార్స్ చిత్రాల షూటింగ్‌లను పక్క రాష్ట్రాలలోనో లేదా మరెక్కడైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో... ఎందుకంటే వారిని చూడటానికి వచ్చే ప్రేక్షకులను, ప్రజలను కంట్రోల్ చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌చరణ్ మైత్రిమూవీమేకర్స్‌బేనర్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి పల్లెలూరి బ్యాక్‌డ్రాప్ ఉన్న చిత్రం కావడంతో సేమ్ అలాంటి పరిస్థితులే ఉండే పొలాచ్చిలో ఈ చిత్రం షూటింగ్ చేయాలని భావించారు. ఇక మేజర్ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా పల్లెటూరిని ప్రతిబింబించేలా ఓ భారీ విలేజ్ సెట్ వేయాలనుకున్నారు. కానీ ఎట్టకేలకు గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించారు.
కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కైకలూరు మండలంలోని కొల్లేటికోట రోడ్డులో సర్కార్ కాలువ వంతెనపై జరిపారు. ఇందులో పల్లెటూరి యువకునిగా నటిస్తున్న చరణ్‌పై కొన్ని సీన్స్‌ని చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి షూటింగ్ చూడటానికి పోటెత్తారు. దీంతో ప్రజలను కంట్రోల్ చేయడం గగనమైపోయింది. అయినా షూటింగ్‌కు ఇబ్బందులు తలెత్తలేదు. ఈ పోటెత్తిన ప్రజలను చూసి చరణ్ సర్‌ప్రైజ్ అయిపోయి పేస్ బుక్ లో మెసేజ్ అండ్ వీడియో కూడా పోస్ట్ చేసాడు.
నాపై ఇంతగా ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ఆనందం మాటల్లో చెప్పలేనని అన్నాడు. ఇక కొల్లేటి ప్రాంతానికి, ఉభయగోదావరి జిల్లాలలో మెగాభిమానులు ఎక్కువ. కాగా కొల్లేటితో మంచి అనుబంధం ఉన్న చరణ్, సుకుమార్‌లు తమ చిత్రం షూటింగ్ కొల్లేరులో జరిపినందు వల్ల ప్రస్తుతం పలువురి దృష్టి కొల్లేరుపై పడి, అదో పర్యాటక స్థలంగా మారుతుందనే ప్రశంసలు లభిస్తున్నాయి.