ప్రస్తుతం సమంత అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టనుంది. ఇప్పటికే నాగచైతన్య-సమంతల నిశ్చితార్ధం ఈ ఏడాది జనవరిలో జరిగింది. కాగా ప్రస్తుతం నాగచైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' తో పాటు కొత్త దర్శకుడు కృష్ణవైరిముత్తు దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత చందుమొండేటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు.
ఇక సమంత రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంతో పాటు సావిత్రి బయోపిక్ 'మహానటి'లో ఓ కీలకపాత్రను పోషిస్తోంది. ఇందులో సమంత జమున క్యారెక్టర్‌ని చేస్తోందని, కాదు.. కాదు.. ఓ జర్నలిస్ట్ పాత్రను చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఇక నాగార్జున, సమంతలు ఓంకార్ దర్శకత్వంలో ఓ మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతున్న 'రాజుగారి గది2'లో నటిస్తున్నారు. ఇందులో నాగ్ మనుషుల మనస్తత్వాలతో ఆడుకునే ఓ మెంటలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ సమంత ఏ క్యారెక్టర్ చేస్తుందో అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది.
ఆమె పాత్ర కూడా బలమైన కీరోల్ కాబట్టే ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున, సమంతల మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. మరి నాగ్, సమంతల క్యారెక్టర్ల మధ్య లింక్ ఏమిటి? అనే విషయం ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేపుతోంది.