Advertisementt

రజనీయే బిజెపి అస్త్రమా..?

Sun 23rd Apr 2017 05:15 PM
rajinikanth,bjp,sesikala,late jayalalithaa,annadmk party,tamil nadu politics  రజనీయే బిజెపి అస్త్రమా..?
Rajinikanth is the BJP Weapon..? రజనీయే బిజెపి అస్త్రమా..?
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌.. మహారాష్ట్రకు చెందిన ఈయన కర్ణాటకతో పెరిగి, చివరకు తమిళనాడు ఆరాధ్యదైవం అయ్యాడు. ఇక ఈయన వివాదరహితులు, త్యాగశీలిగా, నటునిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక ఎప్పటి నుంచో మోదీ రజనీని రాజకీయాలలోకి తేవాలని కృషి చేస్తున్నాడు. ఆయన ఒప్పుకుంటే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పినా, చివరకు జయలలిత మరణం తర్వాత ఆయనకు నిజంగానే సీఎం అయ్యే అవకాశాలు వచ్చినా కూడా ఆయన రాజకీయాలోకి రాలేదు. ఇక ప్రస్తుతం బిజెపి దక్షిణాదిని మరీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకల్లో పాగా వేయాలనుకుంటోంది. 

ఇక శివసేనను దూరంగా ఉంచి మహారాష్ట్రలో దూసుకుపోతోంది. దీంతో మోదీ, అమిత్‌షాలు వ్యూహాత్మకంగా రాబోయే రాష్ట్రపతి అభ్యర్ధుల లిస్ట్‌లో రజనీ పేరు కూడా చేర్చారని సమాచారం. తద్వారా బిజెపికి ఉత్తరాది పార్టీ అనే ముద్రతోపాటు ఉత్తరాది పెత్తమని మండిపడుతున్న దక్షిణాది వారిని కూడా సంతృప్తి పరిచేలా వ్యూహం ఖరారు చేసిందట. బాబ్రీమసీదు వివాదం వల్ల అద్వానీ, మురళీ మనోహర్‌జోషిలు రేసులో లేకపోవడం, మోదీకి మరో ఆప్తుడైన అమితాబ్‌పై పనామా పేపర్స్‌ వివాదం రావడంతో ఇతరుల కంటే రజనీవైపు బిజెపి దృష్టి సారించవచ్చని అంటున్నారు. 

ఇక శశికళ, దినకరనలను అడ్డుకున్న బిజెపిపై ఇప్పటికే తమిళనాట కాస్త సానుకూల వాతావరణం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల నాటికి రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వడానికి, అందరి అభ్యర్థిగా అన్ని పార్టీలు రజనీపై సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.గతంలో వాజ్‌పేయ్‌ కూడా అబ్దుల్‌కలాంను తెరపైకి తెచ్చి ప్రఖ్యాతి తెచ్చుకున్న రీతిలోని రజనీ ఎంపిక ఉంటుందంటున్నారు.

Rajinikanth is the BJP Weapon..?:

Rajinikanth is from Maharasthra who grew up with Karnataka and eventually became Tamil Nadu worshiper. The BJP can focus on Rajnikanth way than others. In the past, Vajpayee has also brought Abdul kalam to the screen and Rajani will be chosen in popularity.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ