Advertisementt

సుకుమార్ చిత్రంలో చరణ్ పాత్ర ఇదే..!

Mon 24th Apr 2017 07:23 PM
ram charan,chitti babu,sukumar,fisherman,ram charan role,repalle movie  సుకుమార్ చిత్రంలో చరణ్ పాత్ర ఇదే..!
Ram Charan's Name in Sukumar Film సుకుమార్ చిత్రంలో చరణ్ పాత్ర ఇదే..!
Advertisement
Ads by CJ

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రంలో చరణ్ దివ్యంగుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. చెవిటివానిగా నటిస్తున్న చరణ్ ఈ చిత్రంలో ఊర మాస్ లుక్ లో దర్శనమిచ్చే కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక అప్పటినుండి రామ్ చరణ్, సుకుమార్ చిత్రంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడో.. తెలియక ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.  అయితే చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడనే ప్రచారమైతే జోరుగా జరిగింది. అయినా ఈ చిత్రం పల్లెటూరి ప్రేమ కథగా ఉంటుందని ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో, కొల్లేరు పరివాహక ప్రాంతంలో  షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ రోల్ బయటికి వచ్చేసింది.

రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చేపలు పట్టే యువకుడిగా కనిపిస్తాడని అంటున్నారు. మరి మొదటిసారి రామ్‌చ‌ర‌ణ్ ఓ బెస్త‌వానిగా .. చెవిటివానిగా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా సమంత కూడా చరణ్ తో మొదటిసారి జోడి కడుతుంది. అంటే సమంత కూడా ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా కనబడుతుందన్నమాట. ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. రామ్ చరణ్ - సుకుమార్ చిత్రానికి రేపల్లె అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎక్కడా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

Ram Charan's Name in Sukumar Film:

Ram Charan is currently shooting at Rajahmundry for his upcoming under the direction of Sukumar. He is playing a village guy role in the movie. But now it is officially out that Ram Charan is playing a role of fisherman and his name will be chitty Babu.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ