ఇప్పుడెక్కడ చూసినా మహాభారత గురించే మాట్లాడుకుంటున్నారు సినీప్రియులంతా. ఈ మధ్యన దుబాయ్ సేటు ఒకరు మహాభారతని 1000 కోట్ల బడ్జెట్ తో శ్రీ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నానని చెప్పినప్పటినుండి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ మహాభారత కథ అలా ఉండగా ఇక్కడ టాలీవుడ్ లో హాలీవుడ్ డైరెక్షర్ రేంజ్ లో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి కూడా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ఎప్పుడో చెప్పాడు. కానీ అది ఎప్పుడనేది చెప్పకుండా సస్పెన్సు లో పెట్టేసాడు. అయితే ఇప్పుడాయన తీసిన బాహుబలి ద కంక్లూజన్ చిత్రం విడుదల తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు రాజమౌళిని మహాభారత ని శ్రీ మీనన్ తీసేస్తున్నారు కదా మరి మహాభారతం మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా... మీరు మహాభారతాన్ని డైరెక్ట్ చెయ్యరా... అని అడగగా.. మహాభారతంలో అనేక వెర్షన్స్ వున్నాయి... అందులో వాళ్ళేం వెర్షన్ తెరకెక్కిస్తున్నారో నాకు తెలియదు... మహాభారతం సముద్రమంత ఉంటుంది. అందులో నా వెర్షన్ నాకుంటుందని... చెప్పాడు. అయితే రాజమౌళి మహాభారతం ఎప్పుడుంటుందో మాత్రం చెప్పలేదు. అంటే ఒక సంవత్సరం తర్వాత ఉంటుందా? లేకపోతే పది సంవత్సరాల తర్వాత ఉంటుందా? అనేది క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ సస్పెన్సు లో పడేసాడు. ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి ద కంక్లూజన్ చిత్రం వచ్చే శుక్రవారమే విడుదలవుతుంది.