అలనాటి మేటి అందాల తార శ్రీదేవి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లోను బాగానే రెచ్చిపోయి నటిస్తుంది. మరో పక్క తన కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ ని చేస్తానంటూ చెబుతుంది కానీ అది ఎప్పుడో చెప్పదు. ఈ లోపు జాన్వీ కపూర్ తన అంద చందాలతో గ్లామర్ గా రోజూ మీడియాకి చిక్కుతూనే ఉంటుంది. ఒకసారి అందాలతో రెచ్చిపోతుంది... మరోసారి బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ అంటుంది. మరోపక్క యాక్టింగ్ లో శిక్షణ అంటుంది. మరి ఇంకా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే ఇలా రోజూ మీడియాలో హైలెట్ అవుతూనే వుంది.
ఇక ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షోరూం దగ్గర జాన్వీ మేకప్ లేకుండా షార్ట్, వేసుకుని లూస్ షర్ట్, స్లీవ్ లెస్ బనీన్ తో హాట్ హాట్ లుక్స్ తో మరోసారి మీడియా కంటపడింది. ఇప్పటికే తన అందచందాలతో ఎయిర్ పోర్ట్ లో, ఫ్యాషన్ షోలతో సందడి చేస్తున్న జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు జనాలు.